Saturday, May 4, 2024

వాయు ‘గండం’ రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు..

అమరావతి,ఆంధ్రప్రభ: రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం బలపడటంతో కోస్తాంధ్రకు వర్ష సూచనలు జారీ అయ్యాయి. మండు వేసవి మార్చి మొదటివారంలో వాయుగుండం ఏర్పడటం అరుదు. మార్చి 2వ తేదీన ఏర్పడిన వాయుగుండం 24 గంటల వ్యవధిలో బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. సరిగ్గా 28 ఏళ్ళ క్రితం 1994 మార్చి 21వ తేదీన వాయుగుండం ఏర్పడింది. తిరిగి ఇప్పుడు మార్చి. ఏప్రిల్‌ నెల నుంచి సముద్ర ఉపరితల జలాలు వేడెక్కడం ప్రారంభమవుతోంది. దీంతో అల్పపీడనం లేదా వాయుగుండం ఏర్పడటానికి కారణం అవుతోంది. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.

దీనివల్ల నైరుతీ రుతుపవ నాల సమయంలో పుష్కలంగా వానలు కురుస్తాయని సమాచారం. జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు నైరుతి, అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు ఈశాన్య రుతుపవనాలు ప్రభావం చూపుతాయి. సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో వాయుగుండాలు, తుఫాన్లు సంభవిస్తుంటాయి. ఈ దఫా మార్చి మొదటి వారంలోనే వాయుగుండం ఏర్పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పసిఫిక్‌ మహా సముద్రంలో లానినా పరిస్థితులు ఏర్పడటమే వాయుగుండం ఏర్పడటానికి కారణంగా వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement