Saturday, May 4, 2024

పవన్‌ కల్యాణ్‌ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటోంది.. చిరస్థాయిగా నిలిచేలా ఆవిర్భావ సభ

అమరావతి, ఆంధ్రప్రభ: జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నాయకత్వాన్ని రాష్ట్రం కోరుకుంటోందని, ఈ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారా కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఈ నెల 14వ తేదీన జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ మన చరిత్ర, సంస్కృతి ఉట్టిపడేలా.. మన ప్రాంత ఔన్నత్యం ప్రతిబింబించేలా ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విజయవాడ, కృష్ణా జిల్లాల జనసేన కమిటీ-ల సమావేశం నిర్వహించారు. ఆవిర్భావ సభను ఎలా విజయవంతం చేయాలనే అంశంపై నాయకులకు, కమిటీ- సభ్యులకు మనోహర్‌ దిశానిర్దేశం చేశారు. పార్టీ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలని ఆకాంక్షించారు. ఈ సభ కోసం జనసైనికులతో పాటు- ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, పోలీస్‌ శాఖ పర్మిషన్లు ఇచ్చినా, ఇవ్వకపోయినా సభ నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.

రహదారులన్నీ జనసేన జెండాలతో నిండి పోవాలని, పండుగ వాతావరణం తీసుకురావాలని జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘ఆవిర్భావ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది జనసైనికులు, వీర మహిళలు తరలి వస్తారు. వాళ్లందరినీ కృష్ణా, గుంటూరు జిల్లా నాయకులు సాదరంగా ఆహ్వానించాలి. వాళ్లకు అవసరమైన ఆహారం, మంచినీళ్లు దారిలోనే అందించాలి. సభకు వచ్చిన దగ్గర నుంచి పూర్తయి తిరిగి వెళ్లే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు- చేయాలని పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. అందుకనుగుణంగా సీటింగ్‌, సభకు చేరుకోవడానికి ప్రత్యేక దారి ఏర్పాటు- చేస్తున్నాం. ఎటు-వంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్ల ఏర్పాట్లు- జరుగుతున్నాయి. వాళ్లు ఎక్కడ ఉన్నా సభ కనిపించేలా ఎల్‌.ఇ.డి. స్క్రీన్లు ఏర్పాటు- చేస్తున్నాం’ అని నాదెండ్ల వివరించారు.

ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపై సమరానికి సిద్ధమవ్వాలి
ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోతోందని, మొండి పట్టు-దల, పిచ్చి నిర్ణయాలతో అన్ని వర్గాలకు నష్టం వాటిల్లుతోందని మనోహర్‌ విమర్శించారు. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సీఎం వైఖరిపై మనమంతా సమరానికి సిద్ధమవ్వాలని, అందుకు ఈ సభే నాంది కావాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం అవసరమని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు. వాళ్లలో ధైర్యం నింపే విధంగా అధ్యక్షులు పని చేసుకుంటూ వెళ్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు గురయ్యారని, అయినా దేనికోసమైతే పార్టీ ఏర్పాటు- చేశారో వాటికి కట్టు-బడి ఉన్నారని స్పష్టం చేశారు. మధ్యతరగతి, పేద కుటు-ంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎంపీటీ-సీలు, జెడ్పీటీ-సీలుగా పోటీ- చేయగలుగుతున్నారంటే జనసేన వల్లేనని స్పష్టం చేశారు.

అనుమతులివ్వకున్నా సభ జరిగి తీరుతుంది..
సభ నిర్వహణ కోసం పార్టీ నాయకులు పోలీసు శాఖ పర్మిషన్ల కోసం ప్రయత్నిస్తున్నారని, పోలీసులు ఇస్తారనే నమ్మకం ఉందని, ఒకవేళ రాజకీయ ఒత్తిళ్లతో అనుమతులివ్వడానికి నిరాకరించినా.. సభ మాత్రం జరిగి తీరుతుందని నాదెండ్ల స్పష్టం చేశారు. సభా వేదిక నుంచి అధినేత ఏం మాట్లాడతారా అని ప్రజలందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, మనం ఏ మార్గంలో నడవాలి? రాజకీయ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న దానిపై పవన్‌ కల్యాణ్‌ ప్రసంగిస్తారని వివరించారరు. ఇతర పార్టీల్లా జనసేన పార్టీ ఓటు- బ్యాంకు రాజకీయాలు చేయదని, ప్రజా సమస్యలపై మాత్రమే పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అందుకు నిదర్శనమే సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోయిన నాలుగు నెలలకే భవన నిర్మాణ కార్మికుల కోసం రోడ్ల మీదకు వచ్చామని గుర్తు చేశారు. ఈ సభను అందరూ సొంత కార్యక్రమంలా భావించి విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

రెచ్చగొడతారు.. రెచ్చిపోవద్దు..
సభకు ఆటంకం కలిగించడానికి చాలా మంది ప్రయత్నిస్తారని, మాటలతో రెచ్చగొడతారని, ఇబ్బంది పెట్టాలని చూస్తారని నాదెండ్ల అన్నారు. రాజకీయాల్లో ఇవన్నీ సహజమని, జనసేన నాయకులు గానీ, జనసైనికులు గానీ, వీరమహిళలు గానీ వారి ఉచ్చులో పడొద్దని, సహనం కోల్పోవద్దని సూచించారు. ఇంత పెద్ద స్థాయిలో మీటింగ్‌ జరుగుతుంటే అసూయతో రగిలిపోయి తప్పుడు ప్రచారాలు చేస్తారని, అయినా మనం హుందాగా వ్యవహరించాలని కోరారు. సమావేశం గురించి ప్రజలందరికీ తెలిసేలా సోషల్‌ మీడియాలో, స్థానికంగా మీడియా సమావేశాలు ఏర్పాటు- చేయాలని సూచించారు. సభ విజయవంతమయ్యేలా సమష్టి కృషి చేయాలని కోరారు. సమావేశంలో కృష్ణా జిల్లా, విజయవాడ నగర అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ, పోతిన వెంకట మహేష్‌, రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, సహ కార్యదర్శి పోతిరెడ్డి అనిత, మచిలీపట్నం ఇంఛార్జ్‌ బండి రామకృష్ణ, పామర్రు, గుడివాడ నియోజకవర్గాల ఇంఛార్జులు తాడిశెట్టి నరేష్‌, బూరగడ్డ శ్రీకాంత్‌, బొలిశెట్టి వంశీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement