Thursday, May 2, 2024

యానాంలో వీకెండ్ లాక్‌డౌన్

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళ్ సై నేతృత్వంలో గురువారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రా.10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఉన్న నైట్ కర్ఫ్యూ యథాతథంగా ఉంటుందన్నారు. ఈనెల 26 నుంచి అత్యవసర సేవలు మినహా మిగిలిన వాటిపై ఆంక్షలు ఉంటాయన్నారు.

యానాంలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లతో పాటు అన్ని వ్యాపార సముదాయాలకు మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు మేరకు వివాహాది శుభకార్యాలకు 100 మంది, అంత్యక్రియలకు 50 మంది వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. అత్యవసర సేవల్లో పాల్గొన్నే సిబ్బంది, వాహనాలు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు కలిగి ఉండాలన్నారు. రాజకీయ, మతపరమైన సమావేశాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement