Saturday, April 27, 2024

ఎంబీబీఎస్‌ రెండో విడత ప్రవేశాలకు 28వ తేది వరకు వెబ్‌ఆప్షన్లు

వరంగల్‌, ప్రభన్యూస్‌ ప్రతినిధి: ఎంబీబీఎస్‌ కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి ఈనెల 26 నుంచి 28వ తేదివరకు వెబ్‌ఆప్షన్లు నిర్వహించనున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు హెల్త్‌ యూనివర్సిటీ శనవారం రెండో విడత ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాళోజీ విశ్వవిద్యాలయం పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్య కళాశాలల్లోని కన్వీనర్‌ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. కళాశాలలోని కన్వీనర్‌ కోటా సీట్ల ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి 28వ తేది మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప ్షన్లు నమోదు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో చూడాలని యూనివర్సిటీ వర్గాలు ఆ ప్రకటనలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement