Friday, January 27, 2023

Spl Story: కాకతీయ కళావైభం.. తేలియాడే ఇటుకల నిర్మాణం గణపేశ్వరాలయం

తెలుగునేలను ఏకం చేసి పాలించిన కాకతీయ సామ్రాజ్యంలో కళలు వికసించాయి. అనేక ఆలయాలు, గోపురాల వాస్తురీతులు, నిర్మాణ శైలీ నేటీకీ పరిశోధకులకు ప్రశ్నా ర్థకంగానే మిగిలాయి. ఆనాటి నాగరికథ, కళలు, సాంస్కృ తిక వికాసం, వైభవం వర్తమానానికి, భవిష్యత్తుకు మార్గదర్శ కాలుగా నిలిచాయి. నాటి ఘన చరిత్ర పై నేటీకీ పురావస్తు పరిశోధకులు తమ మస్తిస్కాలకు పదును పెడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్పఆలయ గోపురాలు నీటిలో తేలియాడే ఇటికలతో నిర్మించారనేది బహుళప్రచారంలో ఉన్న సత్యం. అయితే అలాంటి దేవాలయాలు, ఆదే వాస్తురీతిలో నిర్మిం చిన కాకతీయ కాలం నాటి ఆలయాలు మరిన్ని ఉన్నాయనేది పురవస్తు శాఖ పరిశోధకుల్లో వెలుగు చూశాయి. ఇదే వాస్తు రీతుల్లో రామప్పశిల్పి నిర్మించిన మరిన్ని ఆలయాలు ఉన్నాయని పురావస్తు పరిశోధకులు వాదిస్తూ నిరూపిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది గణపేశ్వర ఆలయం.

‌- హైదరాబాద్‌, ఆంధ్రప్రభ

- Advertisement -
   

కాకతీయ సామ్రాజ్య రాజధాని వరంగల్‌ లోని గణపురం మండలంలోని కాకతీయుల అపూర్వ శిల్పకళా వైభవానకి నిదర్శనంగా గణపేశ్వర ఆలయం (కోటగుళ్లు) నేటికి శిథిలావస్థలో ఉంది. ఈ శిల్ప సౌందర్యం సుప్రసిద్ధవేయిస్థంబాల గుడి, రామప్ప దేవాలయాలకు సమా నంగా ఉండటం గమనార్హం. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు క్రీ.శ. 1234లో జయసంవత్సర వైశాఖ శుద్ధ త్రయోదశి బృహస్పతి వారం గణపురంలో గణపేశ్వర ఆలయం, గణ సముద్రాన్ని ప్రారంభించినట్లు శాసనాలు లభ్యం అవుతున్నాయి.

రామప్పదేవాలయాన్ని నిర్మించిన కాకతీయ సర్వసైన్యా ధ్యక్షుడు రేచర్ల రుద్రారెడ్డి మూడో కొడుకు గణపురం సామంతుడు గణపతిరెడ్డి ఆధ్వర్యంలో గణపేశ్వర ఆలయం నిర్మించినట్లు చరిత్ర కారులు చెపుతున్నారు. గణపేశ్వర ఆలయంలో 21 ఉప ఆలయాలను నిర్మించారు. ఈ ఆలయసముదాయాన్నే కోట గుళ్లుగా వ్యవహరిస్తున్నట్లు చరిత్ర చెపుతుంది. ఈ ఆలయ సము దాయానికి సామంతరాజు గణపతి రెడ్డి 60 ఎకరాలు దానంగా ఇచ్చారు. ఈ భూముల్లో పండే పంటలు ఆలయ దీప దూప నైవేద్యానికి, అంగరంగ భోగాలకు వినియోగించినట్లుచరిత్ర కారులు చెపుతున్నారు. అలాగే ఈ ఆలయంలో 72 మంది సేవకులు ఒకరాజనర్తకి, 16 మంది వాయిద్య కళాకారులుఉండే వారని నాట్య ప్రదర్శనలు, సంకీర్తనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించేవారు.

ఆలయానికి దక్షిణ వైపున్న రంగ మంటపం లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు.విజ్ఞాన,సంగీత ,సాహిత్య కవి సమ్మేళనాలు నిర్వహించి కాకతీయుల ఔన్నత్యం నలుదిశలా చాటి చెప్పేవారు. కాకతీయ సామ్రాజ్యంలో రాజపోషణలో ఉన్న ఈ ఆలయానికి ప్రత్యేక వాస్తురీతులతో ఎంతో వైభవంగా నిర్మించారు. గణపతి దేవుని అనంతరం రుద్రమాదేవి ఈ ఆలయ అభివృద్ధిపై దృష్టి సారించడంతోపాటు కాకతీయ రాజ్యంలోని ఆలయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఇచ్చినట్లు శాసననాలద్వారా తెలుస్తోంది. దేవగిరి రాజును ఓడించిన అనంతరం గణపేశ్వర ఆలయంలో గజకేసరి శిల్పాన్ని తన విజయానికి చిహ్నంగా ఇక్కడ చెక్కించినట్లు తెలుస్తుంది.ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. రుద్రమ దేవి, ప్రతాపరుద్ర పాలనలో ఇక్కడ నాయంకర సైన్యం తో పాటుగా 2000 ల అశ్వసైన్యంరాజపోషణలో ఉండేదనిచరిత్ర చెపుతుంది.

రామప్పదేవాలయం గోపురాలను నీటిలో తేలియాడే ప్రత్యేక ఇటుకలతో నిర్మించారు. అదే విధానం గణపేశ్వర ఆలయ గోపు రాలను కూడా నిర్మించినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి నివేదికలు కూడా సమర్పించారు. ఈ ఆలయం పునాదుల్లో ఇసుక ఉండటంతో ఒక ప్రత్యేక పద్దతిలో ఇసుక రాసులమధ్య తేలియాడే ఇటుకలతో ఆలయాన్ని నిర్మించడంతో ఆలయ పునా దులు ఇప్పటికీ చెక్కుచెదలేదు. అయితే గణపేశ్వర పరివారదేవతల విగ్రహాలు, ఆలయాలు గుప్తనిధుల కోసం వాడి గునపపు దెబ్బలకు ఛిద్రమవు తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. కాకతీయ రాజులు, కాకతీయ సామంతులు అనేక ఆలయాలు, చెరువులను ప్రత్యేక వాస్తురీతుల్లో నిర్మించి తరతరాల ప్రజలకు అంకితమిచ్చారు. అయితే గణపేశ్వర ఆలయం వాస్తు రీతులు బహుల ప్రచారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం ఈ ఆల యంలోని శిల్ప సంపద ఢిల్లి సుల్తానులు ధ్వంసం చేయడమే .

క్రీ.శ. 1323 ప్రతాపరుద్రుని అనంతరం ఢిల్లి సుల్తానులు ధ్వంసం చేసిన ఆలయాల్లో ప్రధా నంగా గణపేశ్వర ఆలయం ఉంది. క్రీ.శ 1320 లో అల్లాఉద్ధీన్‌ ఖిల్జి సైన్యాధిపతి మాలిక్‌ కాఫర్‌ అలీఖాన్‌ ఈఆలయాన్ని దాదాపుగా నేలమట్టం చేశారు.ప్రధాన ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న 60 స్థంభాల మంటపంలో ఉన్న కిన్నెర, కింపు రుష, మం దాకిని శిల్పాలను నాశనంచేసినా ఆకారాలు మిగి లాయి. వాస్తవానికి ధ్వంసం కాకుండా శిల్పసంపద ఉంటే రామప్ప దేవా లయానికి సమాంతరంగా గణపేశ్వర ఆలయానికి గుర్తింపు వచ్చేది.

అయితే ఆలయ శిల్పసంపదను ధ్వంసం చేయగలిగారేకానీ వాస్తురీతులను కాదు. అందులో ప్రధానంగా గోపురాలను ధ్వంసం చేయకపోవడంతో వందలాది సంవత్సరాలు ఆలయ ఉనికి మరుగున పడింది. 1320 నుంచి నిజాం పాలనవరకు ఈ ఆల యాన్ని ఎవరూ గమనించలేదు. శాండ్‌ బేసిడ్‌ టెక్నాలజీతో కాకతీ యులు నిర్మించిన ఆలయం వందలసంవత్సరాలుగా గుర్తింపు కోల్పోయింది. 1320 నుంచి ఆలయఅభివృద్ధి కోసం ఎవరూ పట్టించుకోకపోవడంతో శిలావస్థలో మిగిలిపోయింది. తొలిసారిగా 1930లో నిజాం పాలనలో పురావస్తు శాఖ డైరెక్టర్‌ గులాం యజ్దానీ గణపేశ్వరం చరిత్రను వెలికి తీసి అభివృద్ధికి కృషిచేశారు. అనంతరం రాష్ట్ర పురావస్తుశాఖ కేంద్ర నిధులతో కొంతమేరకు సంరక్షించినప్పటికీ పూర్తి స్థాయి రక్షణకు నోచుకోలేదు.

విధ్వంసం కాని మూలిరాట్టు విగ్రహం

ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌ లో గణపేశ్వర ఆలయం గోపురాలు తేలియాడే ఇటుకలతో నిర్మించినట్లు పురావస్తు శాఖ పరిశోధకులు నిర్ధారించారని పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్ట్‌ వెంకట రత్నం చెప్పారు. అయితే అనంతరం ఈ ఆలయ పరిశోధనలు జరగపోవడంతో ఆలయానికి రావల్సినంతగుర్తిపు రాలేదన్నారు. ఈ ఆలయంలో ని మూలవిరాట్టు విగ్రహాన్ని ఢిల్లి సుల్తానుల దండయాత్రలో ఢిల్లి రాజప్రతినిధి షితాబ్‌ ఖాన్‌ ఒకగోతితీసి మూలవిరాట్టు విగ్రహాలను, శిల్పాలను కాపాడినట్లు చరిత్ర చెపుతుందన్నారు. ఆ విగ్రహాలే నేటికీ మిగిలాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement