Saturday, April 27, 2024

అఖండ భారత్‌ నిర్మిస్తాం, 10-15 ఏళ్లలో కల సాకారం: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌

అఖండ భారత్‌ కల సాకారం రానున్న 10-15 ఏళ్లలోనే పూర్తవుతుందని ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ స్పష్టం చేశారు. భారత్‌ తన లక్ష్యాన్ని చేరకుండా ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. అఖండ భారత్‌ స్వామి వివేకానంద, మహర్షి అరబిందో కల అని చెప్పుకొచ్చారు. అఖండ భారత్‌ సాధనకు 20-25 ఏళ్లు పడుతుందని అంటున్నారని, వేగం పెంచితే.. ఈ కల 10-15 ఏళ్లలోనే పూర్తవుతుందని మోహన్‌ భగవత్‌ తెలిపారు. వివేకానంద, మహర్షి అరబిందో అనుకున్న భారతదేశాన్ని తప్పకుండా చూస్తామన్నారు. హరిద్వార్‌ వేదికగా.. నిర్వహించిన కార్యక్రమంలో సాధువులను ఉద్దేశిస్తూ మోహన్‌ భగవత్‌ మాట్లాడారు. అహింసకు తాము దూరమని భారత్‌ చెబుతూ ఉంటుందని, కానీ కర్రను కూడా మోస్తుందని గుర్తు చేశారు. ఎందుకంటే.. ప్రపంచం శక్తిని మాత్రమే అర్థం చేసుకుంటుందని చెప్పుకొచ్చారు.

భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, బర్మా, టిబెట్‌, ఆఫ్గనిస్తాన్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌లను కలిపితే అఖండ భారత్‌. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 20-25 ఏళ్లలో అఖండ భారత్‌ నిర్మాణం జరుగుతుందని అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు స్వామి రవీంద్రపూరి చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. మోహన్‌ భగవత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. అరబిందో వంటి తతవేత్తలు చెప్పినట్టు వాసుదేవుడి (శ్రీకృష్ణుడి) కోరిక మేరకు భారత్‌ ఎదుగుతుందన్నారు. సామి వివేకానందపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. అందరూ కలిసి మరింత వేగంగా ముందడుగు వేస్తే.. 10-15 ఏళ్లలోనే అఖండ భారత్‌ నిర్మాణం అవుతుందని వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement