Friday, April 26, 2024

భూమిపై ఉన్న నీరు సూర్యుడి కంటే పాతది, సౌర కుటుంబంలో ఆనవాళ్లు

మనకు నిత్యం లభ్యమయ్యే నీరు ఎక్కడినుంచి వస్తుంది.. ఎలా లభ్యమవుతుందో.. తెలుసుకోవడానికి జాతీయ రేడియో అస్ట్రానమీ అబ్జర్వేటరీకి చెందిన దక్షిణ యూరోపియన్‌ ఖగోళ శాస్త్రవేత్త.. జాన్‌ జే టోబిన్‌ తన .అధ్యయనంలో ద్వారా కనుగొన్న వివరాలను రచనగా ఒక జర్నల్‌లో ముద్రితమైంది. నీటి లభ్యత అనేది సూర్యుడికంటే ముందే.. నక్షత్రాల మూలాల నుంచి గాలి, ధూళిరూపంలో ఉన్నట్లు అధ్యయనంలో గుర్తించినట్లు తెలిపారు. సౌర వ్యవస్థలో నీటికి సంబంధించిన ఆనవాళ్లను కనుగొన్నట్లు వెల్లడించారు. వీటి ఆధారాలను గుర్తించేందుకు పొడవైన మిల్లిమీటర్‌, సబ్‌ మిల్లిమీటర్‌ను కనిపెట్టే అల్మా టెలిస్కోప్‌ను ఉపయోగించి భూమికి పైభాగంలో 1300 సంవత్సరాల కాంతి సంవత్సరాల్లో వి883 ఓరియోనిస్‌ అనే నక్షత్రం చుట్టూ ఏర్పడిన డిస్క్‌లో నీటి లభ్యత ఆనవాళ్లను గుర్తించారు.

ఇక్కడనీరు ఒక రసాయన రూపంలో కలిగి ఉన్నట్లు.. సూర్యునికంటే పైన సౌరకుటుంబంలోని ఉన్న నక్షత్రాలు చుట్టూ ఏర్పరచుకొనే గ్యాస్‌ మేఘాల నుండి గ్రహాల వరకు నీరు ఎలా పరిణామం చెందిందో.. వాటి లభ్యత భూమిపై ఉన్న నీటికి ఆధారాన్ని.. వివరిస్తుంది.. దీంతో ఈ అధ్యయనాన్ని బట్టి సూర్యుడికంటే ముందే నీటి లభ్యత ఏర్పడిందనే దానికి నమ్మకాన్ని ఇస్తోంది. ఆకాశంలో సౌర వ్యవస్థలో సూర్యుడు ఏర్పడక ముందు నీటి మూలాలను గుర్తించినట్లు ఆస్ట్రానమీ అబ్జర్వేటరీకి చెందిన రచయిత, శాస్త్రవేత్త జూన్‌ జే టోబిన్‌ తన రచనలో బహిర్గతం చేశారు.

- Advertisement -

వాయువు, ధూళి రూపంలో మేఘం కూలిపోయినప్పుడు.. దాని మధ్యలో ఒక నక్షత్రాన్ని ఏర్పరుస్తుంది. ఆ నక్షత్రం చుట్టూ మేఘం నుండి ఒక పదార్థం డిస్క్‌ను ఏర్పరుస్తుంది. కొన్ని మిలియన్‌ సంవత్సరాల కాలంలో డిస్క్‌లోని పదార్థం కలిసి తోకచుక్కలు, గ్రహ శకలాలు, గ్రహాలను ఏర్పరుస్తుందని తెలిపారు. జాన్‌ టోబిన్‌ ఉపయోగించిన అల్మా టెలిస్కోప్‌ ఆధారంగా దక్షిణ యూరోపియన్‌తో నీటి లభ్యతను గుర్తించేందుకు శ్రమించారు. నీరు రసాయన రూపంలో నక్షత్రం వద్ద ఏర్పడే మేఘం నుండి గ్రహాల వరకు మార్గాన్ని కొలవడానికి నీరు లభ్యతపై భారీ సంస్కరణను అధ్యయనం చేశారు. హైడ్రోన్‌ అణువులలో ఒకటి డ్యూటేరియంతో భర్తి అవుతున్నట్లు చెప్పారు. ఇది హైడ్రోజన్‌ యొక్క భారీ ఐసోటోప్‌ అని చెప్పారు.

సాధారణ మరియు భారీగా నీరు దొరుకుతోంది. ఈ నీరు ఎప్పుడు ఎక్కడ ఏర్పడిందో తెలుసుకోవడానికి వాటి నిష్పత్తి విలువను లెక్కించాలి. సౌర వ్యవస్థ తోకచుక్కలలోని ఈ నిష్పత్తి భూమిపై ఉన్న నీటిలో సమానంగా ఉన్నట్లు ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. తోకచుక్కల ద్వారా భూమిపైకి నీటిని పంపిణీ చేసి ఉండవచ్చని ఆధారాలు సూచిస్తున్నాయని పరిశోధకులు నివేదిక రూపంలో రాశారు. దీనికి వి 883 అనే ఒక నక్షత్రం ద్వారా ఏర్పడిన నీరు ఏర్పడిన ఆథారాన్ని .. కనిపెట్టినట్టు జాన్‌ టోబిన్‌ తెలిపారు. డిస్క్‌లో నీరు ఏర్పడే కూర్పు ఏర్పరచుకున్న సౌరవ్యవస్థలోని చుక్కల మాదిరిగానే ఉంటుందన్నారు.

నీరు గ్రహ వ్యవస్థలో బిలియన్‌ సంవత్సరాల క్రితమే సూర్యునికి ముందే గ్రహాల మూలాల్లో నీరు ఏర్పడిందనే ఆలోచనను ధృవీకరిస్తోంది. తోకచుక్కలు మరియు భూమి రెండింటి ద్వారానే నీరు ఏర్పడలేదని పరిశోధకుడి అంచనా. నీటి పుట్టుక అనేది చాలా గమ్మత్తుగా ఏర్పడింది. గ్రహాల్లో ఏర్పడిన డిస్క్‌లలో చాలా నీరు మంచుగా స్తంభింపచేయబడుతుంది. ఇది మనం కనిపెట్టలేనంతగా రహస్యంగా ఉందని నెథర్లాండ్‌కు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి మార్గోట్‌ లీమ్‌కర్‌ తన రచనలో వెల్లడించాడు. భవిష్యత్తులో ప్రత్యేకంగా తయారుచేసిన పెద్ద టెలిస్కోప్‌ ద్వారా ఇంకా కొన్ని ఆధారాలను కనిపెట్టవచ్చని ఆశిస్తున్నట్లు తెలిపాడు. దీనికి ప్రస్తుత కాలానికి తగ్గట్టు.. ప్రత్యేకంగా తయారుచేసిన పరికరం టెలిస్కోప్‌తో.. సౌరవ్యవస్థలో ఏర్పడే నీరు గ్యాస్‌ రూపంలో ఎలా ఏర్పడుతుందో.. కనిపెట్టి దీనికి పరిష్కారం చూపవచ్చన్నారు. గ్రహాల్లో ఏర్పడే డిస్క్‌లలోని మంచు, వాయువు నుంచి నీరు ఏర్పడుతోందని గమనించినట్లు పరిశోధకుడు, రచయిత లీమ్‌కర్‌ తన రచనలో వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement