Saturday, April 27, 2024

వాల్తేరు వీరయ్య వర్కింగ్ స్టిల్స్.. రవితేజ చేతిలో మేకపిల్ల.. వైరల్ గా ఫొటోస్

వాల్తేరు వీరయ్య చిత్రంలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు మాస్ మహరాజ్ రవితేజ. ఈ చిత్రంలో హీరోగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు..హీరోయిన్ గా శ్రుతి హాసన్ నటిస్తోంది. రవితేజ జోడీగా కేథరిన్ అలరించనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను జనవరి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి సంబంధించి, రవితేజ పోర్షన్ ను చిత్రీకరిస్తున్నారు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ కంపోజ్ చేసిన పోరాట సన్నివేశాలను చిత్రీకరించే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నారు. అందుకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ ను షూటింగ్ స్పాట్ నుంచి రిలీజ్ చేశారు. రవితేజ చేతుల్లో మేకపిల్ల .. చుట్టూ వేట కొడవళ్లతో కొంతమంది రౌడీలు .. ఇదంతా చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్నారనే విషయం అర్థమైపోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement