Saturday, March 25, 2023

ఈనెల 13న ఆకాశంలో మరో అద్భుతం

ఆకాశంలో మ‌రోసారి అద్భుతం చోటుచేసుకోనుంది. ఖ‌గోళంలో భూమికి అత్యంత‌ స‌మీపంలో ఉన్న‌ శుక్ర, అంగారక గ్రహాలు ఈ నెల 13న పరస్పరం మ‌రింత‌ దగ్గరగా వచ్చి ఆకాశంలో కనువిందు చేయనున్నాయి. అంత‌కుముందు రోజు అంటే ఈ నెల 12న ఆ గ్రహాలకు దగ్గరగా చందమామ కూడా దర్శనమివ్వనుంది. ఎలాంటి సాధనాలు అవసరం లేకుండా కంటితో నేరుగా ఈ అద్భుతాన్ని వీక్షించవ‌చ్చ‌ని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఖ‌గోళంలోని ఆయా గ్రహాల కక్ష్యల‌ దృష్ట్యా కొన్ని అరుదైన సందర్భాల్లో ఇలా ఒక‌దానికొక‌టి ద‌గ్గ‌ర‌గా వ‌స్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. ఈ నెల 13న అంగారకుడు, శుక్రుడు పరస్పరం అత్యంత దగ్గరకు వచ్చినప్పుడు ఆ రెండు గ్ర‌హాల మధ్య దూరం 0.5 డిగ్రీల మేర మాత్రమే ఉంటుంద‌ని చెప్పారు. ఆ రెండు గ్రహాలు, చంద్రుడు పరస్పరం దగ్గరకు వచ్చే ప్రక్రియ గురువారం నుంచే మొద‌ల‌వుతుంద‌ని, 13న అవి మరింత దగ్గరగా కనిపిస్తాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement