Friday, April 26, 2024

తునివు పోస్ట‌ర్.. అజిత్ లుక్ అదిరిపోయిందిగా

తునివు చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు త‌మిళ స్టార్ హీరో అజిత్ కుమార్. హెచ్‌. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రబృందం తెలిపింది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తున్నారు. తాజాగా మరో అజిత్‌ స్టిల్స్‌ను రిలీజ్‌ చేశారు. స్టైలిష్‌ లుక్‌తో ఉన్న ఈ స్టిల్స్ నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జీ-స్టూడీయోస్‌తో కలిసి బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాడు.

జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే అజిత్‌ ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్‌ పనులను పూర్తి చేసుకున్నాడు. ఈ చిత్రం సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్‌ కానుంది. కాగా తెలుగులో రిలీజ్‌ అవుతుందో లేదో ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఇక ఇప్పటికే అజిత్‌-హెచ్. వినోద్‌ కాంబోలో వచ్చిన ‘నేర్కొండ పర్వాయ్’‌, ‘వలిమై’ చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఇక ‘తునివు’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్‌ విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. మ‌రి ఈ చిత్రం అజిత్ కి ఏ మేర విజ‌యాన్ని అందిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement