Tuesday, March 26, 2024

అన్నమయ్య కీర్తనలు : కోడెకాడు వీడె వీడె

ప|| కోడె కాడు వీడె వీడె గోవిందుడు
కూడె ఇద్దరు సతుల గోవిందుడు

చ|| గొల్లెతల వలపించె గోవిందుడు
కొల్లలాడె వెన్నలు గోవిందుడు
గుల్ల సంకు చక్రముల గోవిందుడు
గొల్లవారింట పెరిగె గోవిందుడు

చ|| కోలచే పనుల గాచె గోవిందుడు
కూల గమ్మె కంసుని గోవిందుడు
గోవ వేల కొండెత్తె గోవిందుడు
గూలెపు సతుల దెచ్చె గోవిందుడు

చ|| కుందనపు చేలతోడి గోవిందుడు
గొందులు సందులు దూరె గోవిందుడు
కుందని శ్రీ వేంకటాద్రి గోవిందుడు
గొంది దోసెనసురుల గోవిందుడు

Advertisement

తాజా వార్తలు

Advertisement