Thursday, May 2, 2024

టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావులో.. రేణుదేశాయ్ పాత్ర వంద నిమిషాలు

చాలా కాలం త‌ర్వాత వెండితెర‌పై క‌నిపించ‌నుంది న‌టి రేణుదేశాయ్. మాస్ హీరో ర‌వితేజ న‌టిస్తోన్న టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు చిత్రంలో ముఖ్య పాత్ర‌లో మెర‌వ‌నున్నారు.ఈ ఏడాదిలో టైగర్ నాగేశ్వరరావు సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నటి రేణు దేశాయ్ పాత్ర కొద్ది సమయం మాత్రమే ఉందని చాలామంది భావిస్తున్నారు. కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఏకంగా 100 నిమిషాలు నిడివి ఆమె స్క్రీన్ టైం అని తాజాగా వార్తలు వైరల్ అవుతున్నాయి.రవితేజతో కాంబో సన్నివేశాలు సినిమాలో చాలా స్పెషల్ గా ఉంటాయట. అంతేకాకుండా రవితేజ .. రేణూ దేశాయ్ ల మధ్య ఉండే కొన్ని సెంటిమెంటు సన్నివేశాలు మనసుకు హత్తుకునేలా ఉంటాయని కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఈ సినిమాలో ఎక్కువ నిడివి పాత్రను రేణు దేశాయ్ చేస్తున్నార‌ట‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement