Sunday, April 28, 2024

రాజకీయాలనుంచి తప్పుకోవాలని ఎన్నోసార్లు అనుకున్నా: నితిన్‌ గడ్కరి

తాను రాజకీయాలనుంచి తప్పుకోవాలని చాలాసార్లు అనుకున్నానని, జీవితం అంటే ఇకా ఎంతో ఉందని భావించేవాడినని కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదార్ల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. రాజకీయాలంటే సమాజంలో మార్పుకోసం పనిచేసే రంగమని, కానీ ప్రస్తుతం అధికారం చేపట్టేందుకే రాజకీయాలన్న భావన పేరుకుపోయిందని అన్నారు. నాగ్‌పూర్‌లో సామాజిక కార్యకర్త గిరీష్‌ గాంధీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు.

మాజీ ఎమ్మెల్సీ అయిన గిరీష్‌ గాంధీ శరద్‌పవార్‌ సారథ్యంలోని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీలో పనిచేశారు. రాజకీయాలు సామాజిక, ఆర్థిక సంస్కరణలకు నిజమైన సాధనాలని, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న నేతలు విద్యారంగం, కళలు, సాంస్కృతిక రంగాల్లో మార్పులకు పనిచేయాలని సూచించారు. రాజకీయం అన్న పదానికి అసలు అర్థమేమిటో వారు తెలుసుకోవాలని, సమాజం, ప్రజల సంక్షేమమే రాజకీయమని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement