Thursday, May 16, 2024

కొత్తగా 581 కరోనా కేసులు, గ్రామాల్లోకి పాకుతున్న వైరస్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజు కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 581 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 14, 884కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 645 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4566కు చేరింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా 28306 మందికి కరోనా టెస్టులు చేశారు. తాజా కేసుల్లో 227 కేసులు ఒక్క హైదరాబాద్‌లోనే నమోదు కాగా… గ్రామీణ జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

నిన్న మొన్నటి వరకు నల్గొండ, ఖమ్మం , మంచిర్యాల , పెద్దపల్లి జిల్లాల్లో ఒక అంకెకే పరిమితమైన కరోనా కేసులు ఇప్పుడు రెండెంకల స్థాయికి చేరుకున్నాయి. ఖమ్మం జిల్లాలో 20, కరీంనగర్‌ 15, మేడ్చల్‌ మల్కాజిగిరిలో40, రంగారెడ్డిలో 45, నల్గొండ 20, మంచిర్యాల 24, పెద్దపల్లి 30, సంగారెడ్డిలో 5 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement