Saturday, April 27, 2024

త్వరలోనే ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయం

ఏపీలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు, సంస్కృత అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఏఎన్‌యూలో 13 మంది భాషా పండితులకు ఆయన గిడుగు రామమూర్తి పురస్కారాలను అందజేశారు. అనంతరం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తపాలాశాఖ రూపొందించిన ప్రత్యేక కవర్‌ను మంత్రి ఆదిమూలపు సురేష్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయి నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టినా తెలుగును కచ్చితంగా బోధించాలని స్పష్టం చేశారు. తెలుగుకు సంబంధించిన ప్రత్యేక కోర్సులు, డిగ్రీలను తీసుకురానున్నట్టు వెల్లడించారు. తెలుగు గొప్పతనాన్ని ఖండాంతరాలకు వ్యాప్తి చేసేందుకు తాము ఎన్‌ఆర్ఐల సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు సంస్కృత అకాడమీ ఛైర్‌పర్సన్ లక్ష్మీపార్వతి కూడా మాట్లాడారు. తెలుగు, సంస్కృతం వేర్వేరు కాదని, అందుకే తమ ప్రభుత్వం రెండు భాషలకు ప్రాధాన్యం కల్పిస్తోందని తెలిపారు.

ఈ వార్త కూడా చదవండి: శ్మశానంలో ఆన్‌లైన్ పాఠాలు… వైద్య విద్యార్థిని అవస్థలు

Advertisement

తాజా వార్తలు

Advertisement