Sunday, May 12, 2024

కెనడాలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రానికి చెందిన విద్యార్థి కెనడాలో ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా డిండి మండలం ఆకుతోటపల్లి వాసి ప్రవీణ్‌రావు 2015లో ఉన్నత చదువుల కోసం కెనడా వెళ్లాడు. ప్రవీణ్‌‌రావు గురువారం ఉదయం ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా ప్రవీణ్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రవీణ్‌రావు తల్లితండ్రులు నారాయణరావు, హైమావతి. కాగా వీరిది సాధారణ రైతు కుటుంబం అని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement