Friday, April 26, 2024

తెలంగాణ పథకాలు అద్భుతం : తమిళనాడు ఎమ్మెల్యేల బృందం

తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అద్భుతంగా ఉన్నాయని తమిళనాడు ఎమ్మెల్యేల బృందం మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌ను అభినందించారు. తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న దళిత బంధు, ఎస్సీ సబ్ ప్లాన్ పథకాలపై అవగాహన కోసం కరీంనగర్ విచ్చేసిన తమిళనాడు ఎమ్మెల్యేలు నగరంలో మంత్రి గంగుల కమలాకర్ ని కలిసారు. ఈ సందర్భంగా దళిత బంధు ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివరాలను మంత్రి ఎమ్మెల్యేలకు వివరించారు. దళిత బంధు గురించి సంపుర్ణ సమాచారాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యేలు దళిత సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని ముఖ్యమంత్రి కేసీఆర్ ని ప్రశంసించారు. దళిత బంధుతో పాటు తెలంగాణలో ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రిని అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement