Wednesday, May 22, 2024

సునీల్ అంత్యక్రియలకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిని బండి సంజయ్… ఇప్పుడు సునీల్ అంత్యక్రియలకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సంపేట వద్ద బండి సంజయ్ తో పాటు మాజీ ఎంపీ వివేక్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతక ముందు బండి సంజయ్ మాట్లాడుతూ ఉద్యోగాల భర్తీ లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, దీనికి ప్రభుత్వ చేతగాని పాలనే కారణమని ఆరోపించారు. సునీల్ తండ్రి లేవలేని పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సునీల్ కుటుంబానికి పరిహారంతో పాటు ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement