Saturday, April 27, 2024

సిటీపై ఇంట్రస్ట్ చూపుతున్న స్టూడెంట్స్.. కాలేజీల్లో ఫుల్ అవుతున్న సీట్లు

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: సిటీకి వెళ్లి అక్కడి కాలే జీల్లో చదవాలని చాలా మందికి ఉంటుంది. దీంతోనే చాలా మంది కాస్త దూరమైనా కానీ ఆయా జిల్లాల నుంచి హైదరాబాద్‌ నగరానికి చేరుకుని, నగరంతో పాటు చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్‌ కళాశాలల్లో అడ్మిషన్లు పొంది చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారు. దానికి ఎంత ఖర్చు అయినా వెనుకాడటంలేదు. దీంతో కౌన్సెలింగ్‌ సమయంలో హైదరాబాద్‌, హైదరాబాద్‌ చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనే సీట్లన్ని దాదాపు నిండిపోతున్నాయి. కానీ మిగతా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కళాశాలల్లో మాత్రం సీట్లు నిండడంలేదు. సగంపైగా సీట్లు ప్రతీ ఏడాది ఖాళీగానే మిగిలిపోతున్నాయి. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఉండే కాలేజీల్లో నాణ్యమైన విద్య, వసతులు, క్యాంపస్‌ ఇటర్వ్యూలు ఉంటాయనే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉంది. ఆయా కళాశాలల్లో చదివిస్తే మంచి సంస్థలో ఉద్యోగం పొందే వీలుందనే అభిప్రాయం వారిలో ఉంది. దాంతో తమ పిల్లలను నగరానికి పంపించి చదివించేందుకు మొగ్గు చూపి స్తున్నారు.

దీంతో సీటీ కాలేజీలు, పేరున్న కాలేజీల్లో 80 శాతానికి పైగా సీట్లు మొత్తం నిండుతున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మాత్రం ప్రతి ఏడాది 50 శాతంలోపే సీట్లు నిండితున్న పరిస్థితి. ఇక టాప్‌ కాలేజీల్లో నైతే 100 శాతం సీట్లు అన్ని బ్రాంచీల్లో నిండుతున్నాయి. వరంగల్‌ నగరంలోని కాలేజీల్లోనూ సీట్ల బాగానే నిండుతున్నాయి. రాష్ట్రంలో 175 కాలేజీల్లో 79,790 ఇంజనీరింగ్‌ సీట్లు ఉండగా, 26వేల సీట్లు మినహా మిగతా మొత్తం సీట్లు ఇప్పటి వరకు భర్తీ అయ్యాయి. మిగిలిన 26వేల సీట్లకు స్పెషల్‌ రౌండ్‌ , స్పాట్‌ కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు.

ఇంజనీరింగ్‌ కాలేజీలంటే గతంలో హైదరాబాద్‌ తర్వాత నల్గొండ జిల్లాలోనే ఎక్కువగా ఉండేవి. ఒకప్పుడు అవి 50 వరకు ఉంటే ప్రస్తుతం 12 వరకే మిగిలాయి. మిగతా జిల్లాల పరిస్థితి కూడా దాదాపు ఇంతే. సిటీ కాలేజీలతో పాటు జిల్లాల్లోని కాలేజీల్లోనూ సీట్లకు డిమాండ్‌ పెరిగేలా ప్రభుత్వం, కళాశాలల యాజమాన్యాలు చొరవ తీసుకోవాలి. ఏదో చదువు చెప్పేస్తున్నాం కదా అనే ధోరణి నుంచి బయటపడాలని విద్యా వేత్తలు సూచిస్తున్నారు. మంచి అధ్యాపకు లను నియ మించి, మౌలిక వసతులు, క్యాంపస్‌ ఇంట ర్వ్యూలను కల్పించాల్సి ఉంటుంది. అలాగే కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడాని కి కాలేజీలకు ప్రభుత్వం అవకాశం కల్పించా లని యాజమాన్యాలు కోరు తున్నాయి.

గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement