Friday, April 26, 2024

ఆ క్వారీల్లో మైనింగ్‌ ఆపేయండి.. చెన్నై ఎన్‌జీటీ బెంచ్‌ ఆదేశం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : పర్యావరణ అనుమతులు లేని క్వారీల్లో మైనింగ్‌ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశించింది. రాష్ట్రంలో స్టోర్‌ క్వారీలకు పర్యావరణ అనుమతులపై బుధవారం ఎన్‌జీటీలో విచారణ జరిగింది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాలపై చర్యలు తీసుకోని అధికారులపై చెన్నైలోని ఎన్‌జీటీ బెంచ్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనుమతులు లేని క్వారీలను కొనసాగిస్తే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని ఎన్‌జీటీ అభిప్రాయ పడింది. అక్రమ మైనింగ్‌పై తీసుకున్న వివరాలను నివేదిక రూపంలో వారం రోజుల్లో అందజేయాలని ఆదేశించింది. పర్యావరణ అనుమతులు లేని క్వారీల్లో ఎటువంటి మైనింగ్‌ నిర్వహించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

ఇందిరారెడ్డి, నిఖిల్‌రెడ్డి దాఖలు చేసిన పిటీషన్లపై జాయింట్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎన్‌జీటీ విచారణ చేపట్టింది. రంగారెడ్డి జిల్లా బండరావిరాల, దేశముఖి మండలాల్లో అక్రమ మైనింగ్‌, కంకర, తారు మిక్సింగ్‌ ప్లాంట్ల నిర్వహణ వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోందని ఎన్‌జీటీ అభిప్రాయ పడింది. అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను తెలియజేస్తూ నివేదిక అందజేయాలని కోరింది. తదుపరి విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా వేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement