Thursday, May 26, 2022

శంషాబాద్ ఎయిర్ పోర్టులో 551.21 గ్రాముల బంగారం ప‌ట్టివేత‌

రంగారెడ్డి జిల్లా ప‌రిధిలోని శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా త‌ర‌లిస్తున్న‌ బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. కువైట్‌ నుంచి హైదరాబాద్‌కు జే9 403 నంబరు గల విమానంలో వచ్చిన ఓ వ్యక్తి నుంచి 551.21 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. బంగారంపై రేడియం పూత పూసి ఇద్దరు మహిళల హ్యాండ్‌ బ్యాగులకు అమర్చి అక్రమంగా తరలిస్తుండగా తనిఖీలు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement