Wednesday, April 17, 2024

భారతదేశపు అగ్రగామి ఫిన్‌టెక వేదిక ఫోన్‌పే విడుదల..

హైదరాబాద్‌,(ప్రభ న్యూస్‌) : 2022 మొదటి త్రైమాసికం (జనవరి-మార్చ్‌)కు డిజిటల్‌ పేమెంట్‌ -టె-ండ్స్‌ ను భారతదేశపు అగ్రగామి ఫిన్‌ -టె-క్‌ వేదిక ఫోన్‌ పే బుధవారం విడుదల చేసింది. ఖచ్చితమైన, సమగ్రమైన డేటా కోసం భారతదేశపు ఏ-కై-క గమ్యస్థానంగా తాజా ఫోన్‌పే ప్లూస్‌ -టె-ండ్స్‌ దేశంలోని డిజిటల్‌ పేమెంట్లపై ఆసక్తికరమైన పరిశోధన ఫలితాలను వెల్లడించింది. ఈసందర్భంగా ఫోన్‌పే స్ట్రాటజీ అండ్‌ ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌ విభాగం హెడ్‌ కార్తీక్‌ రఘుపతి మాట్లాడుతూ…

తమ గత ఏడాది నాలుగో త్రైమాసిక నివేదికలో ఊహించిన విధంగా 2022 మొదటి త్రైమాసికంలో వివిధ రకాల వినియోగానికి తమ యాప్‌ ఉపయోగించడం, పెరగడం వల్ల కాంటాక్ట్‌ లెస్‌ పేమెంట్ల దిశగా వినియోగదారు ప్రవర్తన మారుతుండడం మరింత బలపడిందన్నారు. డిజిటల్‌ పేమెంట్లు నిజంగా మర్చంట్‌ ఎకోసిస్టంను చొచ్చుకువెళ్లి, దేశవ్యాప్తంగా విస్తృతంగా అంగీకారం పొందుతుండడాన్ని సూచించేలా ఫోన్‌ పే పీ2ఎం లావాదేవీలు పీ2పీ లావాదేవీలనుమించడం తమకెంతో ఆనందాన్నిస్తోందన్నారు. ఇది అంతర్గతంగా మర్చంట్‌ అంగీకారం, వినియోగదారు డిమాండ్‌ పెరిగిన విషయాన్ని సూచిస్తుందన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement