Sunday, May 12, 2024

Delhi | సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం రాష్ట్ర కమిటీదే.. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుపై సీతారాం ఏచూరి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు, సీట్ల సర్దుబాటుపై తమ రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్కిస్ట్) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ప్రస్తుతం సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. ఏయే స్థానాల్లో పోటీ చేయాలన్న అంశం కూడా రాష్ట్ర నాయకత్వమే నిర్ణయిస్తుందని తెలిపారు.

- Advertisement -

శనివారం ఢిల్లీలోని సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం హరికిషన్ సింగ్ సూర్జిత్ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పాలస్తీనా, గాజా వ్యవహారంలో భారత ప్రభుత్వ వైఖరిని ఆయన ఖండించారు. ఐక్యరాజ్య సమితి వేదికలో పాలస్తీనాను ఆదుకునే వ్యవహారంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. భారత్ మానవతా దృక్పధంతో వ్యవహరించాలని సూచించారు. భారత వైఖరిని ఖండిస్తూ ఆదివారం మధ్యాహ్నం గం. 12.00 కు సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం వద్ద నిరసన చేపడతామని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement