Sunday, May 12, 2024

యూట్యూబ్ లో దూసుకుపోతోన్న – సీతారామం డిలేట్ సీన్

సూప‌ర్ హిట్ గా నిలిచింది హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ న‌టించిన సీతారామం చిత్రం. కాగా ఈ చిత్రంలో సీత పాత్రలో మృణాల్ ఠాగూర్ నటించింది. ఈ చిత్రంలోని కీలకమైన పాత్రలో రష్మిక నటించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు.తాజాగా సీతారామం సినిమాకు సంబంధించి తొలగించిన సన్నివేశాలను వైజయంతి నెట్వర్క్ యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేశారు. ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది ఇంత మంచి సీన్ ఎందుకు డిలీట్ చేశారని అభిమానులు కూడా బాధపడుతున్నారు. అయితే ఈ సినిమా నిడివి ఎక్కువగా ఉండడం వల్ల ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను సైతం తొలగించినట్లు సమాచారం. గతంలో కూడా ఒకసారి రష్మిక సన్నివేశాన్ని కూడా కాస్త తగ్గించినట్లు తెలియజేశారు. అందుకు సంబంధించి వీడియోను కూడా యూట్యూబ్ లో విడుదల చేశారు. అలా విడుదల చేసిన వీడియోలకు లక్షలలో వ్యూస్ రాబట్టడం గమనార్హం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement