Thursday, May 2, 2024

గాడ్ ఫాద‌ర్ కి – U/A సర్టిఫికెట్

గాడ్ ఫాద‌ర్ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. ఈ మూవీకి U/A సర్టిఫికెట్ ని ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్నారు. దర్శకుడు మోహన్ రాజా ‘గాడ్ ఫాదర్’ సినిమాను రూపొందించాడు. మలయాళంలో ఆ మధ్య వచ్చిన ‘లూసిఫర్’కి ఇది రీమేక్. ఎన్వీ ప్రసాద్ – ఆర్ బి చౌదరి ఈ సినిమాను నిర్మించారు. అవినీతి రాజకీయాలు .. అన్యాయంగా ఎదగడానికి అవలంబించే మార్గాల చుట్టూ ఈ కథ తిరగనుంది. రాజకీయ జీవితం ఒక చదరంగం వంటిది.. ఎత్తులు పై ఎత్తులు సరిగ్గా వేయకపోతే, శత్రువుల చేతికి చిక్కిపోయినట్టే. అలాంటి రాజకీయాలను ఒక ‘గాడ్ ఫాదర్’ ఎలా శాసించడనేదే కథ. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. చిరంజీవి వైపు నుంచి వదులుతున్న పోస్టర్లు ఒక్కొక్కటి అంచనాలు పెంచుతూ వెళుతున్నాయి. చదరంగం మధ్యలో నుంచి ఆయన రాజసంతో నడిచి వచ్చే పోస్టర్ కి అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement