Friday, April 26, 2024

‘మేజ‌ర్’ వ‌చ్చే ఏడాదే..డేట్ ఫిక్స్..

ఎప్ప‌టి నుంచో ఎదురుచూస్తోన్న మేజ‌ర్ చిత్రం రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు చిత్ర మేక‌ర్స్. ఈ మూవీలో హీరోగా అడ‌వి శేషు న‌టించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11వ తేదీన మేజర్ సినిమాను థియేటర్లలో వరల్డ్ వైడ్ గా విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను మూడు భాషల్లో విడుదల చేస్తున్నట్లు కూడా స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ మేకింగ్ వీడియోను విడుదల చేసింది మేజర్ టీం. 26/11 టెర్రరిస్ట్ దాడిలో తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండాపోరాడిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా మేజర్. శశి కిరణ్ తిక్కా డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు అడవి శేష్. ఇక ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ మరియు శోభితా ధూళిపాళ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే మురళి శర్మ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement