Sunday, April 14, 2024

Flash.. Flash: పోలీసు శాఖ‌కే మాయ‌ని మ‌చ్చ‌.. గంజాయి అమ్ముతున్న ఖ‌మ్మం పోలీసులు..

Telangana: గంజాయి సాగు నిర్మూల‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకుంటుంటే.. మ‌రోవైపు కొంత‌మంది పోలీసులు ఏకంగా గంజాయి అమ్ముతున్న‌ట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షాకింగ్ న్యూస్ ఓ గంజాయి అమ్మ‌కందారు నుంచి పోలీసు అధికారుల‌కు తెలిసింది..

ఎక్సైజ్ శాఖ‌.. ఖ‌మ్మం పోలీసుల ఆధ్వ‌ర్యంలో డెకాయిట్ ఆపరేష‌న్ నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఖ‌మ్మం జిల్లా ఏఆర్ కానిస్టేబుల్స్ గంజాయి అమ్మ‌తున్న‌ట్టు తెలిసింది. ఖ‌మ్మం ఏఆర్ కానిస్టేబుల్ స‌తీష్‌, కొత్త‌గూడెం ఏఆర్ కానిస్టేబుల్ వెంక‌ట్ ఇద్ద‌రూ గంజాయి అమ్ముతున్న‌ట్టు క‌చ్చిత‌మైన స‌మాచారం అందింది. అయితే ఈ డెకాయిట్ ఆప‌రేష‌న్‌లో ఓ గంజాయి స్మ‌గ్ల‌ర్‌ను త‌మ‌దైన రీతిలో ఎంక్వైరీ చేయ‌డంతో గంజాయి అమ్మ‌కానికి సంబంధించిన మొత్త వివ‌రాల‌న్ని బ‌య‌ట‌పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

కాగా ఖ‌మ్మం ఏఆర్ కానిస్టేబుల్ స‌తీశ్ వ‌ద్ద త‌నిఖీలు చేప‌ట్ట‌గా.. 5 కిలోల గంజాయి ల‌భించింది. దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్త‌గూడెం ఏఆర్ కానిస్టేబుల్ వెంక‌ట్ మాత్రం ప‌రారీలో ఉన్న‌ట్టు తెలుస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement