Saturday, April 27, 2024

తెలంగాణ రైతులకు శుభవార్త.. జూన్ 15 నుంచి ‘రైతుబంధు’

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ వానాకాలం సాగుకు వచ్చే నెల 15 నుంచి రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. జూన్‌ 25 లోపు రైతుల ఖాతాల్లో నగదు జమను పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. పార్ట్‌-బీ నుంచి పార్టీ-ఏ జాబితాలో చేర్చిన భూములకు సైతం ఈసారి రైతుబంధు సాయం వర్తింపజేయనున్నట్లు తెలిపింది. జూన్‌ 10ని కట్టాఫ్‌ తేదీగా నిర్ణయించి రైతుబంధు వర్తింపజేయనున్నట్లు వెల్లడించింది. వ్యవసాయశాఖపై సీఎం కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement