Monday, April 29, 2024

పడుకునేముందు అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసా?

కొంతమంది రాత్రిళ్లు చాలా ఆలస్యంగా తింటారు. దీంతో చాలామంది తినగానే పడుకుంటారు. మరోవైపు అర్ధరాత్రి పూట చాలామందికి ఆకలి వేస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఏదిపడితే అది తినేస్తారు. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. పడుకునేముందు అస్సలు తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయని వారు వివరించారు.

★ చాక్లెట్లు
చాక్లెట్‌లో అధిక స్థాయి కెఫిన్ ఉంటుంది. అందుకే అర్ధరాత్రి అల్పాహారానికి ఇది సరైన ఎంపిక కాదు. ఇది నిద్రరాకుండా నిరోధిస్తుంది. దీని వల్ల శరీరం అలిసిపోయి అనారోగ్య సమస్యలు మొదలవుతాయి.
★ ఐస్ క్రీమ్
ఐస్‌ క్రీమ్ నోరూరిస్తుంది. కానీ ఇందులో అధిక చక్కెర ఉంటుంది. అధిక చక్కెర తీసుకోవడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. రాత్రిపూట ఐస్ క్రీమ్ తినడం నిద్రపై కూడా ప్రభావం చూపుతుంది. రాత్రిళ్లు ఐస్ క్రీమ్ తింటే కొలెస్టరాల్ స్థాయి పెరుగుతుందని, ఈ ఒత్తిడి హార్మోన్‌లపై ఫ్రభావం చూపడంతో నిద్రపోవడం కష్టతరంగా మారుతుంది.
★ జంక్ ఫుడ్
రాత్రిపూట పడుకునే ముందు పిజ్జా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ వంటి జంక్ ఫుడ్ తింటే అది మీ నిద్రను పాడు చేస్తుంది. అంతేకాకుండా వీటిని తింటే బరువు కూడా పెరుగుతారు. గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. దీంతో శరీరంలో యాసిడ్‌ల స్థాయి పెరిగి మరుసటి రోజు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది.
★ స్వీట్లు
అధికంగా కేలరీలు ఉండే స్వీట్లను నిద్రకు ముందు అస్సలు తినకూడదు. ఒకవేళ తింటే బరువు పెరిగిపోతారు. అంతేకాకుండా నిద్రపోవడం కూడా కష్టతరంగా మారుతుంది
★ టీ, కాఫీ
నిద్రపోయే సమయంలో టీ, కాఫీ అసలు తాగకూడదు. వీటిలో కెఫిన్ అనే పదార్థం ఉండటం వల్ల నిద్ర సమస్య ఏర్పడుతుంది. అయితే కొన్ని టీలలో ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడే పదార్థాలు ఉంటాయి. మీరు తీసుకునే టీ పరిమాణాన్ని బట్టి ఇది మారుతుంది.
★ చిప్స్
నిద్రపోయే ముందు చిప్స్ తినడం వల్ల అవి జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారంలో పెద్ద మొత్తంలో గ్లూటామేట్ ఉంటుంది. ఇది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement