Wednesday, May 8, 2024

ఆర్ ఆర్ ఆర్ సినిమా స‌ర్క‌స్ లా అనిపించింది-వోడ్కాలోకి పల్లీలను స్టఫ్ గా తీసుకుంటా- రామ్ గోపాల్ వ‌ర్మ‌

ఆర్ ఆర్ ఆర్ సినిమా తనకు ఒక సర్కస్ లా అనిపించిందని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వర్మ. సర్కస్ చూస్తున్నప్పుడు మనకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో… ఈ సినిమా చూసినా అదే ఫీలింగ్ కలిగిందన్నారు. ముఖ్యంగా బ్రిడ్జి దగ్గర ఒక కుర్రాడిని క కాపాడే సీన్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా జెమినీ సర్కస్ చేస్తున్న ఫీలింగ్ తనకు కలిగిందన్నారు. అనేవన్నీ అంటూనే.. తాను మాట్లాడిన మాటలు తప్పుగా ర్ధం చేసుకోవద్దని కూడా వర్మ కోరడం విచిత్రం. తన అభిప్రాయం ప్రకారం… ట్రిపుల్ ఆర్ ను నేను విమర్షించడంలేదు.. సర్కస్ చూస్తున్నప్పుడు ఎలాంటి జోష్ కలుగుతుందో అలాంటిదే ఈ సినిమా చూస్తున్నప్పుడు తనకు కలిగిందని అన్నాను అంతే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు వర్మ.

చాలా విషయాల గురించి ఇలానే మాట్లాడారు వర్మ. ఒక సినిమా మేగజీన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను వోడ్కాలోకి పల్లీలను స్టఫ్ గా తీసుకోవడాన్ని ఇష్టపడతానని చెప్పారు. ఆయన మూవీస్ గురించి ప్రశ్న రాగా.. తన కెరీర్ లో కేవలం క్షణక్షణం, సర్కార్ సినిమాలను మాత్రమే పక్కా స్క్రిప్ట్, దానికి సరిగ్గా సరిపోయే నటులతో తీశానని… మిగిలిన సినిమాలేవీ కూడా ఫలానా నటుడితో చేయాలనుకుని చేయలేదని అన్నారు. తెరపై హీరోయిన్లను తనకంటే అందంగా ఎవరూ చూపించలేరని వర్మ చెప్పారు. ఇక తన జీవితంలో మణిరత్నం సినిమాలు తనకు నచ్చవని స్పష్టం చేశారు. ఒకసారి తామిద్దరం కలిసి స్క్రిప్ట్ వర్క్ లో కూర్చున్నామని… ఆయన తన మాట వినలేదని, తాను ఆయన మాట వినలేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement