Thursday, June 1, 2023

కీడా కోలా మూవీ పూజా కార్య‌క్ర‌మాలు-డైరెక్ష‌న్ వైపు దృష్టి సారించిన త‌రుణ్ భాస్క‌ర్

త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడే కాదు న‌టుడు కూడా..ప‌లు చిత్రాల్లో న‌టిస్తూనే మ‌ళ్ళీ డైరెక్ష‌న్ వైపు దృష్టి సారించాడు. నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని ద‌ర్శ‌కుడిగా ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ సినిమాను చేస్తున్నారు త‌రుణ్ భాస్క‌ర్. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్‌పైకి వెళ్ళ‌నుంది. వీజి సైన్మా, క్విక్ ఫాక్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.ఇప్ప‌టికే ఈ చిత్రం నుండి విడుద‌లైన టైటిల్‌ పోస్ట‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది. మంగ‌ళ‌వారం కీడా కోలా పూజా కార్య‌క్ర‌మాలు గ్రాండ్‌గా ప్రారంభ‌మైయ్యాయి. ఈ వేడుక‌కు టాలీవుడ్ నుండి ప‌లువురు సెల‌బ్రెటీలు గెస్ట్‌లుగా వ‌చ్చారు.నిర్మాత సురేష్‌బాబు, హీరో సిద్ధార్థ్, సుహాస్‌, రాజా గౌత‌మ్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రెటీలు ఈ వేడుక‌కు వ‌చ్చారు. ఈ చిత్రంలోని న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల గురించి మేక‌ర్స్ త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement