Friday, April 26, 2024

డెలివ‌రీ గ‌ర్ల్ గా స్టార్ హీరోయిన్-క‌స్ట‌మ‌ర్ కి పిజ్జా అంద‌జేసిన ర‌ష్మిక‌

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న మెక్ డొనాల్డ్స్ పిజ్జా డెలవరీ గర్ల్ గా మారింది. కస్టమర్స్ కు పిజ్జా డెలివరీ చేసి సర్ ప్రైజ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియా లో వైరలవుతోంది.ఈ వీడియోలో మాస్కు ధరించిన రష్మిక మందన.. బైక్ పైన వెళ్లి కస్టమర్ కు పిజ్జా డోర్ డెలివరీ చేసింది. ఈ వీడియోలో మాస్కు ధరించి ఉన్నప్పటికీ కస్టమర్స్ రష్మికను గుర్తించగా, ఆమె వెంటనే మాస్కు తీసేసింది. అలా వాళ్లు తెగ హ్యాపీగా ఫీలయ్యారు. కస్టమర్స్ రష్మికతో సెల్ఫీ దిగడానికి అనుమతి తీసుకుని సెల్ఫీలు తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో తాను ఇవాళ డెలివరీ గర్ల్ గా వర్క్ చేయాలనుకుంటున్నానని, ఇది ఈ రోజుకు తన జాబ్ అని చెప్పింది. మెక్ డొనాల్డ్స్ స్టోర్ నుంచి పిజ్జా డెలివరీ ఐటమ్స్ తీసుకున్న రష్మిక మందన… వాటిని కస్టమర్ కు అందజేసి వారిని సర్ ప్రైజ్ చేసింది. బ్లాక్ టీ షర్ట్ ప్లస్ జీన్స్ లో స్కూటీ పైన హెల్మెట్ ధరించి కస్టమర్ ఇంటికి రోడ్డు మార్గాన వెళ్లింది రష్మిక. ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=H6HdWgEPGME&t=2s
Advertisement

తాజా వార్తలు

Advertisement