Thursday, April 25, 2024

నీ దుంపతేగ, పిడకలు టేస్టీగా ఉండటమేంట్రా అయ్యా!.. పైగా దానికి రివ్యూ కూడానా!!

పెద్ద పెద్ద సిటీస్​లో ఉండే హైక్లాస్ పీపుల్స్‌తో పాటు ఫారెన్‌లో ఉండే ఇండియ‌న్స్ కోసం అమెజాన్ (ఈకామర్స్​ సంస్థ) పిడ‌క‌ల‌ను అమ్మే ప‌ని పెట్టుకుంది. సాధార‌ణంగా ఈ పిడ‌క‌ల‌ను పండుగల సమయంలో వాడతారు. ఎక్కువగా భోగి పండుగనాడు పిడకలతో వేసే భోగి మంటలకు ఉపయోగిస్తారు. అయితే.. ‘‘కౌ డంగ్​ కేక్స్’’​ పేరిట అమెజాన్​ ఈ కామర్స్​ కంపెనీ ఆన్​లైన్​లో పిడకలను అమ్మకానికి పెట్టింది. వీటి ధర కూడా నిర్ణయించి ఈజీగా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. ఆ మేరకు సప్లయ్​ కూడా చేస్తోంది.

అయితే.. కౌ డంగ్​ కేక్స్​ని తినే పదార్థంగా భావించిన ఓ ఫారెనర్​ చాలా బాగుంటాయి, స్వీట్స్​ కావచ్చు అనుకుని కొనుగోలు చేశాడు. ఆర్డర్ ​పెట్టిన కొద్ది రోజులకు అతనికి పార్సెల్​ డెలివరీ వచ్చింది. దీంతో సంబురపడ్డ ఆ విదేశీయుడు వాటిని ఎంతో ఇష్టంగా తిన్నాడు. దీంతో అతనికి అవి టేస్టీగా అనిపించలేదు. పైగా క్రంచీగా కూడా లేవు. అంతేకాకుండా అంతా మట్టి, గడ్డిపోచలతో ఏదోలా ఉండడంతో అమెజాన్​లోనే దానికి సంబంధించిన రివ్యూ కూడా పోస్టు చేశారు..

‘‘ఇదేం రుచి అస్సలు బాగా లేదు. అంతా మట్టి, గడ్డి ఉంది. పైగా శుభ్రత(హైజీన్​) కూడా లేదు. ఇక.. క్రంచీగా కూడా లేవు. ఈ కేక్స్​ ఇంకా బాగుండేలా చేయండి. కాస్త శుభ్రత పాటిస్తూ.. టేస్టీగా, క్రంచీగా ఉండేలా చేస్తే మరోసారి కొనుగోలు చేస్తా” అని చిరాకుగా రివ్యూ రాసేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement