Saturday, April 27, 2024

రాజ‌మౌళి స‌రికొత్త రికార్డ్.. ఉత్త‌మ ద‌ర్శ‌కుడిగా ఎంపిక చేసిన న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌

ఆర్ ఆర్ ఆర్ తో ఇప్ప‌టికే ప‌లు అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి. కాగా తాజాగా ఈయన మరో ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్నారు. న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్ సర్కిల్‌(NYFCC).. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఉత్తమ దర్శకుడిగా రాజమౌళిని ఎంపిక చేసింది. ఈ అవార్డు సాధించిన తొలి భారతీయ దర్శకుడిగా రాజమౌళి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇంగ్లీష్ సినిమాలతో పోటీ పడి ఒక టాలీవుడ్‌ సినిమా ఈ ఘనత సాధించిందంటే రాజమౌళి గొప్పతనం ఏంటో తెలుస్తుంది. ఇటీవలే లాస్‌ ఏంజిల్స్ టైమ్స్‌ అనే ఇంగ్లీష్ పేపర్‌ రాజమౌళి గురించి ఫ్రంట్ పేజ్‌లో ఓ పెద్ద ఆర్టికల్‌ ప్రచురించింది కూడా.

Advertisement

తాజా వార్తలు

Advertisement