Monday, April 29, 2024

రాబోయే 5 రోజుల పాటు వర్షాలు..

తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో వర్షాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎట్టకేలకు రాష్ట్రంలో రాబోవు 5 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 24 గంటల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు,మెరుపులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే సూచనలు ఉన్నట్లు పేర్కొంది. రాబోయే 24 గంటల్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. అతి తేలికపాటి నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ప్రధానంగా హైదరాబాద్ ఉత్తర భాగంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

సాధారణంగా ఈ టైమ్‌లో 574మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదవుతుందని వెల్లడించింది. గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు,వంకులు పొంగిపొర్లుతూ.. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరిం చుకున్నాయి. ఎగువ నుంచి వచ్చిన వరదతో ప్రధాన జలాశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే గడిచిన 24 గంటల్లో మహబూబాబాద్‌, ఇల్లందు, బయ్యారం, భద్రాచలం ప్రాంతాల్లో 4సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 1సెం.మీ నుంచి 3సెం.మీల వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. ఇక, జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో 30శాతం సాధారణ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: ఓబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

Advertisement

తాజా వార్తలు

Advertisement