Tuesday, April 23, 2024

ఓబీసీ బిల్లుకు లోక్ సభ ఆమోదం

లోక్ సభలో మరో కీలక బిల్లు ఆమోదం పొందింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఓబీసీ బిల్లుకు లోక్ సభ ఇవాళ ఆమోదం తెలిపింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే అప్పగిస్తూ చట్ట సవరణ చేశారు. ఈ 127వ రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును లోక్ సభ ఆమోదించింది. ఓబీసీ బిల్లుకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా, పలు విపక్షాలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఇకపై రాష్ట్రాలే ఓబీసీలను గుర్తించేందుకు మార్గం సుగమం అయింది.

ఇది కూడా చదవండి:బాలీవుడ్ టాప్ బ్యూటీస్ తో ఫర్హాన్ అఖ్తర్ మూవీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement