Thursday, April 25, 2024

ప్రమోషన్స్ స్పెషల్…మరో వీడియో పోస్ట్ చేసిన కొమరం భీం

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. భారీ అంచనాల మధ్య తెరెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు అజయ్ దేవగన్, అలియాభట్ కూడా నటిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ కొమరం భీం గా, అల్లూరి సీతారామరాజు రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరు పాత్రలకు సంబంధించి విడుదలైన టీజర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ సాంగ్ దోస్తీ అంటూ సాగే పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పాట కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా సినిమా రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ లో స్పీడ్ పెంచాడు రాజమౌళి. అందులో భాగంగానే ఎన్టీఆర్ కు పది రోజుల పాటు ఇంస్టాగ్రామ్ ను హ్యాండిల్ చేసే బాధ్యతను చేతిలో పెట్టినట్లు ప్రకటించాడు. అందులో భాగంగానే రోజుకో వీడియోను ఎన్టీఆర్ పోస్ట్ చేస్తున్నాడు. ఈ రోజు ఎన్టీఆర్ కొత్త వీడియో ని పోస్ట్ చేశారు. అందులో షూటింగ్ కి కారులో తన స్నేహితుడితో వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు. కారు లో రామ్ చరణ్ కూర్చొని ఉండగా బ్యాగ్రౌండ్ లో దోస్తీ సాంగ్ వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement