Wednesday, May 8, 2024

ప్రణయ్‌ ముందంజ, కిదాంబి ఔట్‌.. ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు

బ్యాడ్మింటన్‌ ఆసియా చాంపియన్‌షిప్‌ 2023లో గురువారం భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. పురుషుల సింగిల్స్‌లో ఏస్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి దూసుకెళ్లగా, మరో స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఓటమితో టోర్నీనుంచి వైదొలగాడు. ఇక మిక్స్‌డ్‌ డబుల్స్‌ జోడీ రోహన్‌ కపూర్‌-సిక్కిరెడ్డి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టారు. కొరియా జోడీని చిత్తుచేశారు. తదుపరి మ్యాచ్‌లో ఇండోనేషియా ద్వయం జేడన్‌ ఫెర్డినాన్స్‌యా- ఇమానుల్లా విజ్డజాను ఎదుర్కొంటారు.
ఎనిమిదో సీడ్‌ ప్లేయర్‌ ప్రణయ్‌ ఇండోనేషియా షట్లర్‌ చికో ఔరా ద్వి వార్డోయోను 21-16, 21-5, 21-18 తేడాతో ఓడించాడు. తదుపరి మ్యాచ్‌లో జపాన్‌కి చెందిన కాంటా సునేయమాతో తలపడనున్నాడు.

కాగా, కిదాంబి శ్రీకాంత్‌ జపాన్‌కు చెందిన కొడై నరోకా చేతిలో 14-21, 22-20, 9-21స్కోరుతో ఓటమి పాలయ్యాడు. మహిళల డబుల్స్‌ ద్వయం ట్రీసా జాలీ -గాయత్రి గోపీచంద్‌ గాయం కారణంగా మరోసారి టోర్నీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించారు. మరొకజోడీ సుమీత్‌రెడ్డి-అశ్విని పొన్నప్ప చైనీస్‌ తైపీకి చెందిన చాంగ్‌కోచి-లీ చిహ్‌ చెన్‌పై వరుస గేమ్‌లలో 15-21, 17-21 తేడాతో ఓడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement