Tuesday, May 14, 2024

తల్లి కాబోతున్న పోర్న్ స్టార్..ఆ వీడియో లు షేర్ చేయవద్దని విన్నపం..

ఒకప్పటి పోర్న్ స్టార్‌ లానా పాపులర్ వ్లోగర్ త్వరలోనే తల్లి కాబోతుంది. అయితే తన గత జీవితం గురించి తనకు పుట్టబోయే బిడ్డకు తెలియకూడదని ఆమె అంటోంది. ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలియకుండా ఉండాలని జాగ్రత్త పడుతున్నా. ఒక వేళ తెలిసినా ఆ గుర్తులు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్ వెబ్‌సైట్లలో ఆ వీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా అని పశ్చాత్తప్పడుతోంది లానా. ప్రస్తుతం సెక్స్ వర్కర్స్‌తో మాట్లాడుతూ.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలిసేలా ప్రోగ్రాములు చేస్తోంది లానా.

పరిస్థితులు మా చేత ఆ పని చేయిస్తాయి. కానీ కాలం గడిచిన కొద్దీ మా వృత్తి మీద మాకు అసహ్యం వేస్తుంది. మాకూ ఓ జీవితం కావాలనిపిస్తుంది.. మాతో జీవితాన్ని పంచుకునే వ్యక్తి కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటాము. మమ్మల్ని అర్థం చేసుకుని అప్యాయంగా అక్కున చేర్చుకునే భాగస్వామి దొరికితే మాకంటే అదృష్టవంతులు ఎవరూ ఉండరు. మేము మా గత జీవితాన్ని మర్చిపోయి భర్త, పిల్లలతో హాయిగా ఉంటున్నా అక్కడక్కడా కొందరు అదే పేరుతో మమ్మల్ని పిలుస్తుంటారు. అది మమ్మల్ని ఎంత బాధిస్తుందో మీకు అర్థం కాదు అని అంటోంది పోర్న్ స్టార్ లానా రోడ్స్.

ఇది కూడా చదవండి: ఎలాంటి మొగుడు కావాలో చెప్పిన రష్మీక

Advertisement

తాజా వార్తలు

Advertisement