Friday, May 3, 2024

ఎలాంటి మొగుడు కావాలో చెప్పిన రష్మీక

ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది రష్మిక మందన్న. ఇక ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా మారిన రష్మిక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాటు శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా ఓ రెండు సినిమాల్లో నటిస్తోంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రష్మిక తాజాగా ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో కాసేపు ముచ్చట పెట్టారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

అయితే ఓ అభిమాని మీకు ఎలాంటి భర్త కావాలని అడగగా హంగులు, ఆర్భాటాలు లేకుండా చాలా సాధారణ వ్యక్తి అయి ఉండాలని.. మంచి వ్యక్తిత్వం ఉండాలని, స్మోక్ చేసే అలవాటు ఉన్నవారు అస్సలు నచ్చరని చెప్పుకొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ గురించి మరో అభిమాని అడగగా విజయ్ దేవరకొండ నాకు స్నేహితుడని దయచేసి వేరే విధంగా పేర్లు పెట్టొద్దని చెప్పుకొచ్చింది.

రేపటి నుంచి థియేటర్లో దృశ్యం 2…ఎక్కడో తెలుసా ?

Advertisement

తాజా వార్తలు

Advertisement