Friday, April 26, 2024

ఆక‌ట్టుకుంటోన్న.. హిట్2 లిరిక‌ల్ సాంగ్

యంగ్ హీరో అడివిశేషు న‌టిస్తోన్న తాజా చిత్రం హిట్2. నుండి పోరాట‌మే పోరాట‌మే నీజీవితం లిరిక‌ల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. శైలేశ్ కొలను ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్నారు. అడివి శేష్ జోడీగా మీనాక్షి చౌదరి అలరించనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో రావు రమేశ్ .. పోసాని .. కోమలి ప్రసాద్ కనిపించనున్నారు.నాని సొంత బ్యానర్ లో నిర్మితమైన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన థియేటర్లకు రానుంది. హీరో కార్యదీక్ష .. ఆయన ధైర్యసాహసాలకి సంబంధించిన నేపథ్యంలో ఈ పాట ప్లే అవుతోంది. పోలీస్ ఆఫీసర్ గా హీరో డ్యూటీకి సంబంధించిన విజువల్స్ పై వచ్చే పాట ఇది. సురేశ్ బొబ్బిలి స్వరపరిచిన ఈ పాటకి కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించాడు. దర్శకుడు శైలేశ్ కొలను .. నిర్మాత ప్రశాంతి కలిసి ఈ పాటను ఆలపించడం విశేషం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement