Sunday, April 28, 2024

PM MODI: యూఏఈలో నిర్మాణమైన హిందూ దేవాలయం… ప్రారంభించినున్న పీఎం మోదీ..

ముస్లిం దేశంలో తొలి ఐకానిక్ బీఏపీఎస్ హిందూ ఆలయ నిర్మాణం పూర్తయింది. యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయాన్ని ప్రారంభించనున్నారు.

అలాగే అక్కడున్న హిందూ కమ్యూనిటీని ఉద్దేశించి మోడీ ప్రసంగించబోతున్నారు. సుమారు 700 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ అద్భుత ఆలయాన్ని బీఏపీఎస్ స్వామినారాయణ్ ఇనిస్టిట్యూట్ నిర్మించింది.  ఆలయాన్ని నిర్మించడంలో ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహరాజ్ సహకారం ఉంది.యూఏఈలో ప్రారంభిస్తున్న తొలి హిందూ దేవాలయం..

- Advertisement -

అబుదాబిలోని అబు మురీఖా ప్రాంతంలో ఈ మందిరం 27 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఆలయం ప్రారంభానికి దాదాపు 2 నుంచి 5 వేల మంది భక్తులు టెంపుల్ ను సందర్శఇంచే ఛాన్స్ ఉందని భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా పేర్కొన్నారు. 2019 ఏప్రిల్ లో శంకుస్థాపన చేయగా.. అదే ఏడాది డిసెంబర్ లో ఆలయ నిర్మాణ పనులు స్టార్ట్ అయ్యాయి. క్రౌన్స్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబి, యూఏఈ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆలయ నిర్మాణం కోసం 2015లో 13.5 ఎకరాల భూమిని విరాళంగా అందించారు..

2019 జనవరిలో యూఏఈ ప్రభుత్వం మరో 13.5 ఎకరాలను ఆలయ నిర్మాణం కోసం గిఫ్ట్ ఇచ్చింది. ఈ హిందూ ఆలయ నిర్మాణానికి సుమారు 400 మిలియన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దిర్హామ్ లు ( రూ. 700 కోట్లు ) అయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement