Sunday, April 28, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 2, శ్లోకం 44
44
భోగైశ్వర్యప్రసక్తానాం
తయాపహృతచేతసామ్‌ |
వ్యవసాయాత్మికా బుద్ధి :
సమాధౌ న విధీయతే ||

తాత్పర్యము : భోదానుభవము మరియు లౌకిక సంపదలకు ఆకర్షితులై, వానిచే మోహపరవశులగు వారి మనస్సు నందు భగవానుని భక్తియుక్తసేవను గూర్చిన స్థిర నిశ్చయము కలుగనే కలుగదు.

భాష్యము : ‘సమాధి’ అనగా ‘స్థిరమైన మనస్సు’ అని భావము. వేద నిఘంటువైన ‘నిరుక్త’ ప్రకారము ‘సమ్య గాధీయతేస్మిన్‌ ఆత్మ తత్త్వ యథాథ్మ్యమ్‌’ అనగా ఆత్మను అర్థము చేసుకొనుటలో మనస్సును లగ్నము చేసినప్పుడు సమాధిలో ఉన్నట్లు లెక్క. భౌతిక ఇంద్రియ భోగాల వంటి తాత్కాలికమైన వాటిలో మనస్సును లగ్నము చేసినట్లయితే సమాధి ఎప్పటికీ సాధ్యము కాదు. అటువంటి వారు మాయాశక్తిచే పరాజితులు కాబడినట్లు అర్థము చేసుకోవచ్చు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement