Friday, April 26, 2024

ప‌ఠాన్ ప్రెస్ మీట్.. షారుక్ ఖాన్ కి ముద్దు ఇచ్చిన దీపిక ప‌దుకొణే

వ‌సూళ్ల‌తో దూసుకుపోతోంది ప‌ఠాన్ చిత్రం. ఐదురోజుల్లోనే పఠాన్ చిత్రం 500 కోట్లకి పైగా వసూళ్లతో మామూలు రచ్చ చేయడం లేదు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో, యాష్ రాజ్ ఫిలిమ్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతోంది. ఎన్నో వివాదాల నడుమ జనవరి 25న ఈ చిత్రం విడుదలయింది. బాలీవుడ్ స్టార్స్ షారుక్ ఖాన్, దీపికా జంటగా నటించగా.. జాన్ అబ్రహం విల‌న్ గా నటించాడు. పఠాన్ చిత్రానికి టెరిఫిక్ రెస్పాన్స్ వస్తుండడంతో నేడు చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి దీపికా పదుకొనె ముద్దమందారం లాగా అందంగా.. హాట్ గా ముస్తాబై వచ్చింది. ఆమె ధరించిన గౌన్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. క్లీవేజ్ అందాలతో అట్రాక్ట్ చేస్తూ దీపికా వేదికపై కనిపించడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే వేదికపై దీపికా,షారుఖ్ కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. దీపిక.. షారుఖ్ విషయంలో తీసుకుంటున్న కేరింగ్ అంతా ఇంతా కాదు. అలాగే షారుఖ్ కు ప్రేమగా ఒక ముద్దు కూడా ఇచ్చింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆఫ్ స్క్రీన్ లో ఈ రేంజ్ కెమిస్ట్రీ ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement