Wednesday, April 24, 2024

ఎడిటోరియల్ – జనాన్ని కదిలించిన జోడో యాత్ర

శ్రీనగర్‌లో జోరు వానలా మంచు… ఆ మంచులోనే రాహుల్‌, ప్రియాంక చిన్న పిల్లలైపోయి.. పరుగులు పెడుతూ ఆహ్లాదకరంగా మంచు పెళ్ళలు పులుముకుం టూ సరదగా గడిపిన సన్నివేశాలు.. పిల్ల చేష్టలుగా తీసి పారేయ దగ్గవి కావు,ఉద్రిక్తపూరిత లాల్‌చౌక్‌ వద్ద ఆహ్లాద పూరిత వాతావరణాన్ని కల్పించామన్న భరోసాను రాహుల్‌ జాతి జనులకు ఇచ్చారు. తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ కుటుంబానికి చెందిన నాల్గవ తరం నాయకుడు రాహుల్‌ గాంధీ 137 రోజుల పాటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకూ నిర్వహించిన జోడో యాత్ర ఎటువంటి అవాంతరాలు లేకుండా నిర్విఘ్నంగా ముగిసింది.

రాహుల్‌ ఈ యాత్ర చేపట్టడానికి ముఖ్యోద్దేశ్యం ఈ పాటికి దేశ ప్రజలందరికీ తెలిసింది. పదేపదే ఆయన ప్రస్తావన చేయడం వల్ల ఆ లక్ష్యం ప్రజల గుండెల్లో నాటుకుని పోయింది. జనాన్ని కదిలించింది.స్వతంత్ర భారత దేశ తొలి ప్రధాని నెహ్రూ జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాల అమలు కోసం కృషి జరిపిన మాట నిజమే. దానిని ఎవరూ కాదనలేరు.ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలకు ఆయనేనా బాధ్యుడని ప్రశ్నించుకుంటే తిలాపాపంలా అందరికీ ఎంతో కొంత బాధ్యత ఉంది. అయితే, ఆనాటి కన్నా పరిస్థితులు మరిం త క్షీణించిన మాట నిజం. ముఖ్యంగా, కుల, మత, ప్రాంతీ య తత్వాలు బాగా విస్తరించాయి. వీటికి వ్యతిరే కంగా ప్రజలను జాగృతం చేయడం కోసం రాహుల్‌ ఈ యాత్రను జరిపారు. తమిళనాడులోని కన్యాకుమారిలో గతఏడాది సెప్టెంబర్‌ 7వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర ఆదివారం జమ్ము, కాశ్మీర్‌ రాజధాని శ్రీనగర్‌లో చారిత్రా త్మకమైన లాల్‌చౌక్‌లో జాతీయ జెండా ఆవిష్కరణతో ముగిసింది.

దేశ చరిత్రలో ఇది ఒక ముఖ్య ఘట్టం. ఎందు కంటే, జాతీయ పండుగల్లో లాల్‌చౌక్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే కార్యక్రమాన్ని అడ్డుకుంటా మంటూ మూడు దశాబ్దాలుగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదు లు హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో దాడులు కూడా జరిపారు. కాశ్మీర్‌లోని అన్ని వర్గాలనూ కూడగట్టుకోవ డంలో రాహుల్‌ సఫలం కావడం వల్లనే ఇది సాధ్యమైం ది. కాశ్మీర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచును సైతం లెక్క చేయకుండా ఆయన యాత్ర కొనసాగించా రు. పైగా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అక్కడ అధికారా న్ని నిర్వహించిన కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌,పీడీపీ వంటి పార్టీలంతా ఏకతాటిపై నిలిచి రాహుల్‌ నిర్వహిం చిన జెండా వందన కార్యక్రమానికి తోడ్పాటునందించా రు. కాశ్మీర్‌ ప్రజల్లో ఒంటరితనాన్ని పోగొట్టేందుకు ఈ యాత్ర జరిపారన్న విశ్లేషణల్లో నిజమెంతో ఉంది. గతం లో బీజేపీ కురువృద్ధుడు డాక్టర్‌ మురళీ మనోహర్‌ జోషి ఇదే మాదిరిగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌కి ఏకాత్మతా యాత్ర పేరిట యాత్రను నిర్వహించారు. దానికీ కొంత ప్రాచుర్యం లభించినా అది ఒక పార్టీ కార్యక్రమంగానే సాగింది. రాహుల్‌ యాత్ర కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వ ర్యంలో సాగినా అందరినీ కలుపుకుని పోవడంలో ఆయ న కృతకృత్యులయ్యారు. దేశంలోని మిగిలిన ప్రాంతాల న్నింటిలో కన్నా, కాశ్మీర్‌లో మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీలు రాహుల్‌ యాత్రలో పాల్గొని ఆయనకు సౌహార్ధం తెలపడం విశేషమే.

ఎందుకంటే వీరిలో మెహబూబా ముఫ్తీకీ, ఫరూక్‌కూ, ఆయన కుమారుడు ఒమర్‌కూ అసలు పొసగదు. అలాగే, కాంగ్రెస్‌ తరఫున ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఇటీవల ఆ పార్టీ నుంచి తనంతట తాను బయటికి వెళ్ళిన సీనియర్‌ నాయకుడు గులామ్‌ నబీ ఆజాద్‌ ఈ యాత్రలో పాల్గొనరని అంతా ముందే ఊహించారు. రాహుల్‌పైనే అస్త్రాలు వేసి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళడం వల్ల ఆయన జోడో యాత్రలో పాల్గొంటారని ఎవరూ ఊహించలేదు. మిగిలిన రాష్ట్రా ల్లో రాహుల్‌ యాత్రలో కాంగ్రెస్‌లోని వైరి వర్గాల నాయకులు పాల్గొన్నారు. వారంతా రాహుల్‌ పట్ల సంఘీ భావం తెలిపినా, తమ సహజవైరాన్ని బయటపెట్టుకు న్నారు. కేరళలో ఊమన్‌ చాందీ, పీసీసీ మాజీ అధ్యక్షుడు రమేష్‌ చెన్నితల వర్గాల మధ్య ఎంత వైరం ఉన్నా వారంతా రాహుల్‌ యాత్రలో పాల్గొన్నారు. అలాగే, కర్నాటకలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య,పీసీసీ అధ్యక్షుడు డికె శివకుమార్‌ వర్గీయులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి కమలనాథ్‌, ఆయ న ప్రత్యర్ధి వర్గీయుల, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌వర్గీయుల మధ్య వైరం ఈ యాత్ర లో బయటపడినప్పటికీ అది పెద్దది కాకుండా తన యాత్రకు భంగం కలగకుండా రాహుల్‌ చాకచక్యంగా వ్యవహరించారు. ఈ యాత్ర ద్వారా రాహుల్‌ తానేమి టో రుజువు చేసుకున్నారు. తనను పప్పు అంటూ హేళన చేసిన వారికి సమాధానమిచ్చినట్టు అయింది. భారత జోడో యాత్ర రెండో భాగం ఉంటుందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నదాన్ని బట్టి, నిరంతరం ప్రజల్లనే ఉండాలని రాహుల్‌గాంధీ కంకణబద్దులైనట్టు కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement