Saturday, April 27, 2024

విమానంలో బట్టలు విప్పిన ప్రయాణికుడు..

విమానంలో ఓ ప్రయాణికుడు పీకలదాక తాగి హల్‌చల్ చేశాడు. బెంగళూరు-ఢిల్లీ ఎయిర్ ఏషియా విమానంలో ఓ ప్రయాణికుడు పూటుగా తాగి బట్టలు విప్పేసి.. సిబ్బందితో అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో ఉన్న అతడికి కిక్ బాగా ఎక్కిందో ఏమో కానీ.. బట్టలు విప్పేసి బీభత్సం సృష్టించాడు. సిబ్బందితో అమర్యాదగా, అసభ్యంగా ప్రవర్తించాడు. తొలుత లైఫ్‌ జాకెట్ల గురించి అతగాడు సిబ్బందితో వాదనకు దిగాడు. ఆ తర్వాత రెచ్చిపోయాడు. ఉన్నట్టుండి ఒంటిమీదున్న బట్టలన్నీ ఇప్పేశాడు. అతడి చర్యతో సిబ్బంది, తోటి ప్రయాణికులు షాక్ కి గురయ్యారు. తోటి ప్రయాణికులు, సిబ్బంది బతిమాలడంతో కొద్దిసేపటి తర్వాత కూర్చున్నాడు. ఏప్రిల్ 6న బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్తున్న ఐ5-722 విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ఘటనపై ఎయిర్‌లైన్స్ అధికారులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రయాణికుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వారి ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసులు ఆ ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్ ఏషియా విమాన సంస్థ ఆ వ్యక్తిని నో ఫ్లై జాబితాలో చేర్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement