Wednesday, April 14, 2021

పూజా డిమాండ్….రెమ్యునరేషన్ హైక్

ఒక లైలా కోసం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ పూజా హెగ్డే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఆ తరువాత ఈ అమ్మడు అవకాశాలను అందిపుచ్చుకుంది. ఇక గతేడాది వచ్చిన అలావైకుంఠపురములో సినిమా తో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. తాజాగా తన రెమ్యూనరేషన్ కూడా ఈ అమ్మడు అమాంతం పెంచేసిందట. తమిళంలో విజయ్ 65వ సినిమాలు చేయడానికి పూజా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం పారితోషికం మూడు కోట్ల వరకు తీసుకుంటుందట.

ప్రస్తుతం పూజాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పూజా అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో నటిస్తోంది. అలాగే రాధే శ్యామ్ సినిమాలో కూడా నటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News