Monday, May 13, 2024

పాత న్యూస్ పేపర్‌కు భారీగా పెరిగిన డిమాండ్

ఇనుప సామగ్రి, పేప‌ర్ల‌ను కొనే వారు కిలో న్యూస్ పేప‌ర్ల‌కు సాధార‌ణంగా కిలోకు రూ.4-9 మ‌ధ్య ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పాత న్యూస్ పేప‌ర్ల‌కు డిమాండ్ విప‌రీతంగా పెరిగిపోయింది. ఏడాదిగా క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో పేప‌ర్లు వేయించుకునే వారి సంఖ్య పడిపోయింది.

పాత పేప‌ర్లు మార్కెట్లోకి రావ‌డం భారీగా త‌గ్గిపోయింది. దీంతో వాటికి డిమాండ్ పెరిగింది. ప‌లు అవ‌స‌రాల నిమిత్తం పాత పేప‌ర్లను కొనుగోలు చేయాల‌నుకునేవారికి వ్యాపారులు కిలో ధర రూ. 35కు అమ్ముతున్నారు. ఆదిలాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి 10 టన్నుల పేపర్‌ను గుజరాత్‌ నుంచి కొనుగోలు చేశారు. వాటిని భారీ ధ‌ర‌కు నిజామాబాద్, నిర్మల్‌ ప్రాంతాల్లో విక్రయించినట్లు తెలుస్తోంది. ఇంకేం ఇళ్లల్లో పాత న్యూస్ పేపర్లు దాచిపెట్టిన వారందరూ దుమ్ము దులపండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement