Thursday, May 30, 2024

TS CM: కొడంగ‌ల్ లో ఓటు వేసిన సీఎం రేవంత్..

తెలంగాణ రాష్ట్ర‌ వ్యాప్తంగా 17 లోక్ స‌భ‌ నియోజకవర్గాలకు పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈక్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. కొడంగల్ లోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement