Saturday, April 27, 2024

నాగశౌర్య కొత్త మూవీ పూజా కార్యక్రమం.. హాజరైన వి.వి.వినాయక్..కిషోర్ తిరుమల

యంగ్ హీరో నాగశౌర్య తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఈ చిత్రానికి అరుణాచలం దర్శకత్వం వహిస్తున్నాడు. ‘NS24’ చేస్తున్నారు హీరో నాగశౌర్య. వెట్రీ పలనస్వామి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య గత చిత్రాలకంటే భిన్నంగా కనిపిస్తాడని చిత్రబృందం వెల్లడించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో షూటింగ్‌ మొదలు పెట్టనుంది. కాగా తాజాగా చిత్రబృందం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.ఈ కార్యక్రమానికి దర్శకులు వి.వి వినాయక్‌, కిషోర్‌ తిరుమల గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లాంచింగ్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస్‌ రావు, విజయ్‌ కుమార్, అరుణ్‌కుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హరీస్‌ జయరాజ్‌ సంగీతం అందించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement